వ్యాసాలు

బతుక్కి అర్థం చెప్పిన ఆనంద్‌ మరణం

మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి. మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు.  అందులో ఒకరు కామ్రేడ్‌   కటకం  సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌. రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాలలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సుల కోసం వెళ్లేవారు