నవంబర్ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్ హన్మంతు తండ్రి పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం. కానీ ప్రతి జీవికి