(రాజ్యాంగ సవరణలు, మార్పు గురించి ముమ్మరంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోవసంతమేఘంతో ప్రముఖ న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు వై.కే పంచుకున్న విమర్శనాత్మక అభిప్రాయాలు మీ కోసం..) 1. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనగానే ఇంత ప్రతిస్పందన ఎందుకు వస్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలనడం, సవరించాలనడం - ఈ రెండూ ఒకటి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను సవరించడానికి ఆర్టికల్ ౩68 ద్వారా రాజ్యాంగమే అవకాశం కల్పించింది. అయితే, సాధారణ బిల్లును ఆమోదించటానికి భిన్నంగా రాజ్యాంగ సవరణ చేయటానికి ఒక ప్రత్యేక ప్రొసీజర్‌ను 368లోనే పొందుపరిచారు. ఆ ప్రకారం 107 రాజ్యాంగ సవరణ చట్టాలను ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించింది. కానీ, కెసిఆర్ చెబుతున్న కొత్త