జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం. 2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన