తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి. స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో