వ్యాసాలు

కార్పొరేట్ జగత్తు కోసం ఖాకీమయమవుతున్న అడవులు

భారతదేశంలోని మూల మూలకు ద్రవ్యపెట్టుబడి వేగంగా, దూకుడుగా విస్తరిస్తున్నఫలితమే మన దేశంలోని అడవుల కార్పొరేటీకరణ. పెట్టుబడి సంచయనం గురించి ప్రాథమిక అర్థశాస్త్ర పాఠాలు అర్థమైనవారికి ఈనాడు మన దేశంలో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణ గురించి ఆశ్చర్యమో, విచిత్రమో ఏమీ వుండదు. ఆఫ్రికా మూలవాసులు చెప్పుకునే అనుభవం జగమెరిగినదే. ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో రైఫిల్తో వెళ్లిన యురోపియన్ పెట్టుబడిదారులు వారి చేతిలో బైబిల్ పెట్టి వారి భూములను కైవశం చేసుకున్నారని చెప్పుకోవడం తెలిసిందే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన భూమిని స్వంతం చేసుకోకుండా, ఆ భూమిపై ఆధారపడుతున్న రైతులను శ్రామికులుగా మార్చకుండా పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి వుండేదే