కవిత్వం

ఆనంద్

అతని అక్షరాలుఅనంత కోటి పీడితజనహృదయ వేదనలోవెలిసిన నక్షత్రాలువెలుగు ఇవ్వటమే వాటి పని అతని అక్షరాలుప్రజల ప్రతిఘటన పోరులోచెక్కిన శిల్పాలురేపటి చరిత్రకు మూలాలు అతని అక్షరాలుఅమరుల రక్తములోతడిసిన విత్తనాలు ఏ పొలంలో చల్లినాఆయుధాలే మొలుస్తాయి
కవిత్వం

మనోభావాలు

శాకమూరి రవి నాకు రాయిని చూపి  రాముడని నమ్మించి  రాజ్యాలేలే చోట  నేను రాయిని 'రాయని'నిజం మాట్లాడితే  వాని మనోభావాలు   దెబ్బతినవా మరి   నాకు మనుధర్మమే  ధర్మమని నమ్మించి మనుషుల మధ్య   మంటల్ని సృష్టించి  రాజ్యాలేలే చోట  నేను మనుధర్మం గుట్టువిప్పితే  వాని మనోభావాలు దెబ్బతివా మరి  నాకు  అశాస్త్రీయాన్ని  శాస్త్రీయమని  నమ్మించి నా అణువణువునా  కర్మసిద్ధాంతాన్ని కరింగించి అందమైన రాజ్యభవనంలో  కునుకుతున్న మనువుకు  నేేను శాస్త్రీయ గీతాలను అందుకుంటే   వాని మనోభావాలు  దెబ్బతినవా మరి.  
సాహిత్యం కవిత్వం

మానవత్వం చంపబడుతోంది

మానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి సోంతలాభం కోంతమానిపోరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసోంతలాభం అసలే వద్దుప్రజలకోరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం రాశులు ఒకచోటఆకలి మంటలు ఒకచోటవ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికినాలుగడుగులు ముందుకేసిఅన్నం రాశులు ఆకలి సంచులు నింపినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి నెత్తురు మండే శక్తులు నిండేసైనికులారా రారండిపిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొనిమరో నాలుగడుగులు ముందుకే నడిచికోయ్యూరు నండి కోయ్యూరు దాకజనం అలజడి నాడిస్టెతస్కోప్ చేతులతో పట్టినమరో ప్రపంచపు నూతన మానవుడుమానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం