సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది