కథలు

నిర్ణయం

అమ్మను వదిలి ఒకరోజు అయిపోయింది. అయినా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది. నా చుట్టూ జరుగుతున్న వాటిల్లో పడి అమ్మనూ, అమ్మ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలనూ తాత్కాలికంగా దూరంపెడుతున్నానే తప్ప పూర్తిగా తనను గుర్తుచేసుకోకుండా ఒక గంట కూడా వుండలేకపోతున్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరువలో వున్నానని నన్ను రిసీవ్ చేసుకున్న అన్నయ్య మాటల్లో అర్థమయ్యింది. ఇంతలో మా జీప్ ఒక ఊరి దగ్గర ఆగింది. చూసేసరికి అటు పూరి గుడిసే కాదూ, పెంకుటిల్లూ కాదు. ఏదో డిఫరెంట్ గా వుందే అని అనుకుంటూ చూస్తుంటే నల్లగా పొడుగ్గా వున్న ఒక అతను " కామ్రేడ్ నీ కిట్టు