అనువాదాలు సంభాషణ

న్యాయవ్యవస్థపై ఒక మచ్చ

స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది. కానీ ప్రాసిక్యూషన్ చేసిన "గంభీర, తీవ్రమైన" ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.