"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ