SC 998 of 2018 IV మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు నా పేరు సయ్యద్ గపూర్, CT నెంబర్ 6634. నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను. 14.5.2023 నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు. కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను. మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు. మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్, కృష్ణమూర్తి, వెంకటరెడ్డి నా ముఖం మీద కాళ్ళ మీద తన్నారు.