సంభాషణ

అంతిమ వీడ్కోలుపై నిషేధమా ?

తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌.   ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి
సంపాదకీయం

ఫాసిస్టు ధిక్కారంగా విరసం సాహిత్య పాఠశాల

ఎన్ఐఏ దాడులు, విచారణల మధ్యనే ఎగిరిన విరసం జెండా విరసం 22 వ సాహిత్య పాఠశాల ఏప్రిల్ 12 న విజయవాడలో జరిగింది. ఒక వైపు కరోనా భయం మరో వైపు ఎన్ఐఏ సోదాలు, విచారణలు . యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న విరసం మరో యాభైల్లోకి.. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచంతో పనిచేస్తానని కలిసి నడుస్తానని బాస చేసింది. ఈ సాహిత్యపాఠశాలలో ఉండాల్సిన కవులు, కళాకారులు, ప్రజా సంఘాల బాధ్యులు కొందరు జెయిళ్లలో ఉన్నారు. చాలామంది ఎన్‌ఐఏ విచారణలో ఇరుక్కుపోయారు. ఆ వెలితి ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఉత్తేజభరితంగా పాఠశాల జరిగింది. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న
సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులను ఖండిద్దాం

ఢిల్లీలో నార్త్ బ్లాక్లో ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కథలు రాయడంలో తలమునకలైంది. రచయితలు చేయాల్సిన పనిని అది తలెకెత్తుకున్నది. రచయితలనేమో దేశద్రోహులుగా బందీలను చేస్తుంది. ఇప్పటికే భీమాకొరేగాం లాంటి పెద్ద కల్పిత కథను సృష్టించింది. రైతాంగ ఉద్యమం, సిఏఏ సందర్భంలో కూడా కల్పిత కథలు ప్రచారం చేసింది. ఈ సారి అది తెలుగు రాష్టాల ప్రజా సంఘాల కోసం పాత కథనే తిప్పి రాస్తుంది. మార్చి 31 2021 న సాయంత్రం 4 - 5 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్ల మీద ఎన్ఐఏ దాడులు చేసింది. వీరిలో విరసం