విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల సహాయంతో నడుస్తున్నారు. గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే