వ్యాసాలు

గుండెలపై రాసుకున్న గోండుల సాహిత్యం

సాహు (కొమురం భీమ్‌ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసాన్ని పున‌ర్ముద్రిస్తున్నాం.-  వ‌సంత‌మేఘం టీమ్)  సూర్య వంశ దేవతల్‌  కేత దర్శ సితార  సూర్య వంశ రాజధాని  మావబూడె మాతారా  కచ్చీ బాండేగ్‌ మావాసొత్తా  కయ కాల్‌ కుటియాతా  మావా రాజ్‌ బుడేమాతా  సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ
కథలు అల‌నాటి క‌థ‌

పోలీసు దాడి

పొలుమారు మీద కూలీకి పోయినోళ్ళు అడుగుల్లో అడుగులేస్తూ ఇల్లకు జేరుతున్నరు. ఊల్లే సాగల్లు తిరుగుతున్నరు. లచ్చవ్వ ఆయిల్ల గాసం కోసం పొయికింద కయితే ముండ్లకంప ఏరుకచ్చింది. పొయిమీద సంగతి యాదికచ్చేటాల్లకు గుండెల్ల రాయి పడ్డట్టయింది. పొద్దున్నే సోలెడు గట్కకోసం మాదిగిండ్లన్నీ తిరిగింది యాదికచ్చేటాల్లకు ఉన్న పాణం తుస్సు మన్నది. ‘‘కూలీకి పోయినకాడ పటేలు కూలిత్త డనుకుంటే నాలుగురోజులు ఆగల్నన్నడు, కూలోల్ల ఇండ్లల్ల మనులు మాన్యాలున్నట్టు. పూటగాసపోల్లం కూలియ్యమని పట్టుపడితే కావురాలచ్చినయని ఎగిరెగిరిపడ్డడు. మొన్నటిదాక సంఘం మాటని సెప్పినట్టిన్నరు. ఇప్పుడు పోలీసోళ్ళ బిప్రి జూసుకుని మల్ల సాగిచ్చుకుంటాండు’’ తనలోనే అనుకుంటా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు వోయింది లచ్చవ్వ. ‘‘ఈ దిక్కుమాల్ల