కామ్రేడ్ రాజ్ కిషోర్ బీహార్ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు. 1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్‌ఆర్‌సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్ 14, 15 తేదీలలో ఏఐఎల్‌ఆర్‌సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్ రాజ్ కిషోర్ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్‌ఆర్‌సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం