వ్యాసాలు

చినబోయినలచ్చుమమ్మ కొడుకు

గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు. ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు