ఉత్తర ప్రదేశ్లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్లోని