కవిత్వం

రాలిన నక్షత్రాల సాక్షిగా
జనసముద్ర హోరు…

అకాశంలో ఐదు నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా నేల రాలిన వార్త! నన్ను శోక సముద్రాన ముంచెత్తింది! గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది గుండె రాయిలా మారింది! స్పందన లేనట్టు నిశబ్దం నన్ను ఆవరించింది! ఏమీ తోచక అకాశంవైపు చూశాను మేమున్నామంటూ చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు! పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది! అడవి మళ్లీ అంటుకున్నది అ దావానలం కోటి దీపాల వెలుగై చీకటి దారిని చీలుస్తున్నది! నరేంద్రుడు జనప్రభంజనంలో రవితేజంలా వెలుగుతున్నాడు! నిశబ్ద నిశీధి నుండి బయటపడి సముద్రంవైపు చూశాను! సముద్రంలో అల్లకల్లోలం తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన చెట్లు పడిపోతున్నాయి! ఇళ్లు