సెప్టెంబర్ మూడవ వారంలో టైమ్స్ ఆఫ్ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్) లో సౌమిత్రాబోస్ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను