సాహిత్యం వ్యాసాలు

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీ.సీ.ఈ.ఏ) సమావేశం ఉక్కు పరిశ్రమతోపాటు, దాని అనుబంధ సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా కార్పొరేట్‌ సంస్థ పోస్కో (పోహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. మరోవైపు భారత దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యుడు ఆదానీతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి. ఈ విషయాలేవి ఉక్కు పరిశ్రమ కార్మికులకు గానీ, గతంలో