కవిత్వం

మణిపూర్ మినిట్స్

అక్కడి మందార పూల రంగులన్నీ మా అక్కల నెత్తుటితో అద్దిన మెరుగులే...! అక్కడి వాకిట్లన్ని మా చెల్లెల కన్నీళ్ళతో అలకబడినవే....! అడుగు నేల కోసం అంటుకున్న మంటలు కావవి…! పాలకులే ఉత్ప్రేరకాలై ఉసిగొల్పబడ్డ అల్లర్లే…! మణిపూర్ ఇప్పుడు సర్జరీకి నోచుకోలేక పోస్టుమార్టంకు దగ్గరవుతున్న రోగి..! ఏ కృష్ణుడి సాయాన్ని నోచుకోని ద్రౌపది...! రామరాజ్యంలో ఊరేగే శవాల బండిపై ఎందరో తల్లుల కన్నీళ్ళ వడపోత...! అంతా ఆంతమయ్యాకా మణిపూర్ మినిట్స్ అంటూ ఆ మంటల సెగలను దేశమంతా వ్యాపితం చేసే మతోన్మాద పాలకుల చేతుల్లో ఓట్ల సాగరమైంది...!