ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం