సంభాషణ

సమ్మక్క జాతర – తమ్ముని యాది

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ...  మా వూరికి దక్షిణ శివారులో పాలాగు ఒడ్డున  సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నది. నేను నా భార్య, ఇద్దరు పిల్లలు, అవ్వ-నాన్న కలిసి జాతరకు  ఎల్లినం .  వన దేవతలకు మొక్కులు చెల్లించి ఒక కోన్ని కోసి అక్కన్నే చెట్లల్ల వండుకున్నం. రాత్రి 8 గంటలు అయితంది.. పల్లెం లో అన్నం కూర పెట్టుకుని తింటున్న.  పిండారపోసినట్టు తెల్లని వెన్నెల  కురుస్తంది. స్టీల్ పల్లెం పై ఆ వెన్నెల  పడి మెరుస్తంది. ఈ టైంలో తమ్ముడు  ఏమి చేస్తున్నట్లు? ఎక్కడ వున్నట్లు? ఒక్క సారిగా మనసు తమ్ముని మీదికి పోయింది. కోర