కాలమ్స్ కవి నడిచిన దారి

స్వగతం

జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో