సంపాదకీయం

మావోయిస్టులపై నిషేధం ఎత్తివేతే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూలత

పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలన ముగిసి  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చోదకశక్తి అని , తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ సమాజాన్ని వంచన చేసింది. అనేక బలిదానాలు, త్యాగాలు , వర్గాల సమీకరణలో భాగంగా దశాబ్దం క్రితం తెలంగాణ సాకారమైంది‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ  ప్రజాస్వామిక తెలంగాణగా తమ వనరులు తమకు దక్కడమేగాక  నూతన రాష్ట్రంలో తమ ఆకాంక్షలన్నీ  నెరవేరాలని, ప్రజాస్వామిక  భావనలు మరింత విస్తృతం కావాలని ప్రజలు ఆశించారు‌. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్కు నిజం కావాలని
సమీక్షలు

మానసిక గాయాల చరిత్ర

స్వయం సిద్ధ ఎవరి జీవన రాగాలాపన? ఏబిందువు నుండి ఏ బిందువు వరకు ప్రయాణం చేశాయి ఈ కథలు. కధావరణలో స్వయం సిద్ధ స్థానం ఏమిటి? ఒంటరి మహిళల జీవన గాథల వెనుక దాగిన సామాజిక నేపథ్యమేమిటి?   మహిళల జీవన పోరాటంలో అలసిన తరువాత మిగిలిన స్వేచ్ఛ మాటే మిటి . స్వయంసిద్ధ  కథలు  భారత సమాజన్ని స్త్రీల కోణం నుండి అంచనా వేసిన కథలు.  భూస్వామ్య సమాజం  దాని కొనసాగింపులో భాగంగా స్త్రీ పై అధికారాన్ని పురుషుడు మరింతగా కొనసాగిస్తున్నపుడు  తమ జీవితానికి తామే నిర్ణయించు కుంటాం అనే కోణం నుండి వచ్చిన కధలు. సామాజిక చలనంలో
నివాళి

విరసం సంతాపం

గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల  సాంస్కృతిక  అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్‍ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర
వ్యాసాలు

నాణేనికి ఒకవైపు

వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు  నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ   న్యాయ స్థానం,పోలీసులు ఒక  సాకు మాత్రమే.                                                    2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ
కొత్త పుస్తకం

కాలం తయారు చేసిన కవి

ఇటీవల కవిత్వం రాస్తున్నయువతరంలో అనేక నేర్చుకోవాల్సినఅంశాలుఉన్నాయి .వారంతా నిశ్శబ్దంగా, మౌనంగా వర్తమానాన్ని అత్యంత లోతుగా చూస్తున్నారు .ఎక్కడ ఆర్భాటం లేదు రాజకీయ పరిపక్వత పొంది ఉన్నామని భావన లేదు. జీవితాన్ని రాజకీయాల్ని అంచనా వేసే క్రమంలో నిజాయితీ కనబడుతుంది .మన ముందు రూపొందుతున్న పిల్లలు కదా అమాయకత్వం నిండిన చిరునవ్వు ఇవే కదా వీరిలో అదనపు ఆకర్షణ అనుకునే దశ నుండి వారు హఠాత్తుగా కవిగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తారు .వారి కవితా ప్రపంచంలోకి దారి చేసుకుంటే ఇంతటి పరిపక్వత ఎలా వచ్చింది? ఈ పరిణితి వెనుక ఈ తరం పడుతున్న మౌనవేదనేమిటి ? వీరిని దుఃఖితులుగా చేస్తున్న
సమీక్షలు

బహిరంగ ప్రకటనే రాజ్య ధిక్కారం

రాజకీయ, నైతిక, మత, కళా సాహిత్య రంగాలలో ఆనాటికి ప్రబలంగా వుండిన అభి ప్రాయాలను ధిక్కరించేదెవరు? తన అత్మను తాకట్టు పెట్టని వాడే ధిక్కారి కాగలడు.                                                                                                - జార్జి ఆర్వెల్    అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా  బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో  కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి.  నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు
సమీక్షలు

రాజకీయార్థిక నవల ‘చంద్రవంక’

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.
సాహిత్యం కొత్త పుస్తకం

ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.

ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం. విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’
సంపాదకీయం

రాజ్యాన్ని సవాల్‌ చేస్తున్న సిలింగేర్‌, హస్‌దేవ్ పోరాటాలు

దశాబ్దాల మానవ నాగరికతలో ఆదివాసీ పోరాటాలు, వాటి యొక్క ప్రతిఫలనాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్తవికాదు. అయితే ఎప్పటికప్పుడు ఆ పోరాట రూపాలు మారుతూ వస్తున్నాయి. ప్రతి కొత్తతరం తమదయిన అస్తిత్వం కోసమే కాదు, భారత ప్రజల తరపున నూతన పోరాట రూపాలను రూపొందించుకుంటున్నది. ఇది ఆదివాసీల జీవన్మరణ సమస్య కాదు. వారి వ్యక్తిత్వంలోనే కలగలసిన మనుషుల కోసం జీవించడమనే ఆకాంక్ష బలీయమైనది. వనవాసి నవలలో ఆదివాసి మహిళ భానుమతి నాకు భారతదేశమంటే తెలియదు అంటుంది. అరణ్యం మాత్రమే మా ఊరు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వెనుక దాగిన విధ్వంసీకరణలో భానుమతి ఆ మాట అనగలిగింది. ఒక దేశ
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె