సాహిత్యం కొత్త పుస్తకం

ఒక పల్లెటూరి పిల్ల ప్రయాణం

గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే
సాహిత్యం సమీక్షలు

పురాతన యుద్ధ‌భూమి

(ఇటీవ‌ల విడుద‌లైన పి. చిన్న‌య్య క‌థా సంపుటి ఊడ‌ల‌మ‌ర్రి ముందుమాట‌) మిత్రులు పి.చిన్నయ్య తన ఊడలమర్రి కథల సంపుటికి ముందుమాట రాయమని, పదిహేనేండ్ల కాలంలో తాను రాసిన పదహారు కథలు పంపారు. ఈ కథల్లో దాదాపు అన్నీ విరసం కథల వర్క్‌ షాపుల్లో చదివినవే. కథల గురించి రకరకాల చర్చలు జరిగినవే. ఒక్కొక్క కథ చదువుతుంటే.. ఆ సన్నివేశాలన్నీ రూపుకడుతున్నాయి. సాధారణంగా రచయితలు కనపరిచే ఉద్విగ్నతలు, ఆవేశకావేశాలు ప్రదర్శించకుండా సీదాసాదాగా.. ఏమాత్రం డాంబికం లేకుండా చిన్నయ్య మాట్లాడే పద్ధతి - స్థిరమైన ఆ కంఠస్వరం నాకిప్పటికీ గుర్తే. ఇవి అంతిమ తీర్పులో... పరమ సత్యాలో... అనే భావనతో కాకుండా
సాహిత్యం కారా స్మృతిలో

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర