జతీన్ దా మన స్ఫూర్తి
మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ