బ్రాహ్మణీయ హిందుత్వ సాధనాలు ద్వేషం, భయం, పెత్తనం, హింస
(త్వరలో విడుదల కానున్న పాణి వ్యాసాల సంపుటి ద్వేషభక్తి కి రాసిన ముందుమాట) గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే ఇప్పుడు మరింత గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది.