సాహిత్యం కవిత్వం

వాళ్లిద్దరు

ప్రజల ప్రయోజనాలే ప్రాణంగాబతికిన వాళ్లు, వాళ్లిద్దరుఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగినల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొనిశత్రువుకు నిద్ర పట్టనీయనివిప్లవ శ్రేణులకు సేనానిమరొకరు ప్రేమ మాత్రమేచైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందనిబలంగా నమ్మి ఆచరించినవాడువిప్లవ శ్రేణుల గుండెల్లో నెలవైశత్రు సేనలపైకి ఉరికించినవాడుఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులనుకోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదునూతన సమాజాన్ని ప్రసవించేపుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడాఇప్పుడు గుండెల నిండా కర్తవ్యంజయించాలనే తపన, జ్ఞానం కోసం మధనంచలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటంఅమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూమరింత దృఢంగా ప్రజల పక్షంఅందుకేఓటమి తాత్కాలికంగెలుపు ఖాయం! (కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.
ఇంటర్వ్యూ సంభాషణ

మా ఉద్యమానికి ఆయువుపట్టు భూమి సమస్యే

(శాంతి చ‌ర్చ‌ల స‌మ‌యంలో చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్ ప‌త్రిక కా. ఆర్కేతో చేసిన ఇంట‌ర్వ్యూ ఇది. బులిటెన్‌6(న‌వంబ‌ర్ 10, 2004)లో అచ్చ‌యింది. ఇందులో  విప్ల‌వం, వ‌ర్గ‌పోరాటం, శాంతి, స్వావ‌లంబ‌న‌, రాజ్యాధికార స్వాధీనం, ప్రాంతీయ స‌మ‌స్య‌లు మొద‌లైన ఎన్నో అంశాల‌పై ఆలోచ‌నాత్మ‌క స‌మాధానాలు చెప్పాడు. ఇప్ప‌టికీ ఇందులో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌టిలంగా త‌యార‌య్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న డెమోక్ర‌టిక్ స్పేస్ ను ప్ర‌భుత్వం ఇవ్వ‌దు. అది అయాచితంగా రాదు. మ‌న‌లాంటి దేశాల్లో ప్ర‌జాస్వామికీక‌ర‌ణ పోరాటాల ద్వారా, విప్ల‌వాల ద్వారానే సాధ్యం.. అని అన్నాడు. ఈ రోజుకూ విప్ల‌వ‌, ప్ర‌జా పోరాటాల‌న్నిటికీ దారి చూసే భావ‌న‌లు
వ్యాసాలు

ప్రజా జీవితం వెల్లి విరియడానికే మా పోరాటం

(ప్ర‌జా జీవితం వెల్లివిరియ‌డ‌మ‌నే క‌వితాత్మ‌క వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజ‌కీయ  వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడ‌వ‌చ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌, అస‌మ సాంఘిక సంబంధాలు ప‌ట్టి ఉంచిన తావుల‌న్నిటా విప్ల‌వం జ‌రగ‌ల‌వ‌సిందే అంటాడు ఆర్‌కె. కొంద‌ర‌నుకున్న‌ట్ల విప్ల‌వం  ఏదో ఒకానొక స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే ప‌రిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బ‌హుముఖీన‌మైన క‌ర్త‌వ్యం. ఈ విష‌యంలో విప్ల‌వకారుల అవ‌గాహ‌న‌ను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవ‌డం ఈ  రాజ్యం ద్వారా సాధ్యం కాద‌ని, ఈ రాజ్యాంగ ప‌రిధిలో అయ్యేప‌ని కాద‌ని చెప్ప‌డం ఆయ‌న అస‌లు ఉద్దేశం. ఇంత
వ్యాసాలు

నిషేధం ఎత్తివేత రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది

(2004 అక్టోబ‌ర్ 15 నుంచి19 దాకా అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రెండు విప్ల‌వ పార్టీల‌కు మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. దానికి స‌న్నాహంగా తెలుగు స‌మాజాల్లో ఒక గొప్ప భావ సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ మొత్తానికి విప్ల‌వోద్య‌మం వైపు నుంచి కా. ఆర్‌కె నాయ‌క‌త్వం వ‌హించాడు.  శాంతి చ‌ర్చ‌ల  నేప‌థ్యంలో  2004 జూలై నుంచి న‌డిచిన *చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్* ప‌త్రిక బులెటిన్‌2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠ‌కుల కోసం పున‌ర్ముద్రిస్తున్నాం- వ‌సంత‌మేఘం టీం) ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న