సాహిత్యం కవిత్వం

కన్నా..

అదొక నిర్జన మైదానం అప్పుడే గతమైన బాల్యం కన్నీటి కడలి మాటున చిట్టిపొట్ట కోసం నెత్తికెత్తుకున్న పెద్దరికం నీవు పుట్టిన ఈ నేలలో విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం కూల్చివేతా వాళ్లిష్టం అయినా ఎందరికో ఊపిరి చిహ్నం శ్వేదాశ్రువులతో వెలిసిన నిండైన అంబేద్కర్‌ విగ్రహం ఆ నీడలోకి కాసేపయినారా మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి
సాహిత్యం కవిత్వం

బంగారు బుడతలు

కలలు కనే కళ్ళు ఆచ్చాదన లేని వళ్ళు లోకం తెలియని పరవళ్ళు అల్లరి పిల్లలు కాదు వాళ్ళు నవనాగరికులు వాళ్ళు సమిష్టి ఆశల సౌధం వాళ్ళు కాలం రైలు పట్టాలెక్కి జీవితాన్ని బాలెన్స్ చేస్తు విశ్వయాత్ర చేస్తారు వాళ్ళు నింగి, నేలంతా వ్యాపించి మూసిన కిటికీలు తెరిచి మేఘాలతో వూసులు చెబుతారు వాళ్ళు పాలపుంత లాంటి సుదూర కాంతి కిరణాలు వాళ్ళు తేనె జల్లుల పరవశం వాళ్ళు ప్రకృతి ఒడిలో పారవశ్యపు కాంతులు వాళ్ళు పాలకుల నైజానికి సాక్షులు వాళ్ళు ఎవరి సానుభూతి అర్థించని వాళ్ళు ఆత్మగౌరవానికే అందం వాళ్ళు బంగారు బుడతలు స్వేచ్ఛా విహంగాలు ఊహలకు రెక్కలు
సాహిత్యం కవిత్వం

నిప్పు కణిక

కణ కణ మండే నిప్పు కణిక ఆ బాలిక తన సమస్యలన్నింటికీ  నిప్పెలాబెట్టాలో తెలుసు ఆమెకు తల్లికెలా సాయపడాలో తన కలలసౌధం ఎలా నిర్మించుకోవాలో తెలుసు ఆ చిన్నారికి ప్రమోదం కన్నా ప్రమాదమే తనకోసం ఎదురు చూస్తూ ఉన్నా నిప్పు, ఉప్పు తానై నలుగురి కోసం వండడం తెలుసు తన భవిష్యత్తు కోసం కాలాన్ని తన చేతుల్లో బంధించటం తెలుసు ఏడు దశాబ్దాల ఎదురు చూపుల్లో కాల్చి బూడిద చేయాల్సినవేమిటో తెలుసు ఓటుకు నోట్లతో పిట్టకథలు చెప్పే మహా మాంత్రికుల పని పట్టటం ఎలాగో తెలుసు ప్రామిసింగ్ పాలన పునాది ఆ బాలిక భవిష్యత్ కాలాన్ని తన గుప్పిట
సాహిత్యం కవిత్వం

బాల్యమే సరికొత్త ప్రపంచం

మహా రంగస్థలం అదొక మహారంగస్థలంసజీవ రసాయన సమ్మేళనంసామాన్యుల అసాధారణ రంగస్థలంఏ నాట్యాచార్యులు నేర్పని మెలుకువలువేకువ నేర్పని కువకువలుసానుభూతి పవనాలు వీచేది అక్కడేకోపోద్రిక్తులయ్యేది అక్కడేఏ ఇంట్లో అల్లు డు గిల్లాడోఏ కొత్త కోడలు ఎపుడు నిద్ర లేచిందో తెలి సేది అక్కడేసిగపట్లు, తలంట్లుబొబ్బట్లు, ఉడుంపట్లు, తలరాతలపై ముఖ ప్రదర్శనలు అక్కడేఎవరు ఎక్కడ నోరుజారారోతేలిపోయే ది అక్కడేబిందెలదరువు, గానకచ్చేరిఅక్కడే, అదొక మహా రణస్థలంతాగి తెగ వాగేవాడితాట తీసే ధ్వంసరచన చేసేది అక్కడేరకరకాలముఖ భంగిమలు, హావాభావాలు…అదొక మహా రంగస్థలం…… 2. కాసిన్ని ఊసులు అరెరె పెద్దోడా,చిన్నోడా, బుజ్జోడా బలే గురి పెట్టారు రా బాబుల్లారనా చిన్నారి బాలల్లారజీవితమే వేట అయిన చోటమీతో కొన్ని