కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"
సాహిత్యం కథలు

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల
సాహిత్యం కథలు

చంద్రిక‌

చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు.  అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి
సాహిత్యం కథలు

అధిపతి

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి. "మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు" యాంకర్ మొదలుపెట్టాడు."మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా
సంభాషణ

పులి

"సార్ అతను చచ్చిపోయేట్టు వున్నాడు. మనం కొట్టిన దెబ్బలకు అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్" కానిస్టేబుల్ పరాంకుశం కంగారు మాటలకి డి.ఎస్.పి వజేరా చిరాకుగా మొహం పెట్టాడు.2 డిసెంబర్ 2002, సోమవారం మధ్యాహ్నం 3:45 కు, బిజీగా ఉన్న ముంబై దగ్గరి ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో బస్సు సీటు కింద గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన బాంబు పేలింది. బస్సు వెనుక భాగంలో బాంబు ఉంచారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఘట్కోపర్ చివరి స్టాప్ కావడంతో, బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే దిగిపోయారు. తిరుగు ప్రయాణానికి ప్రయాణికులు ఇంకా బస్సులోకి ప్రవేశించలేదు.