సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష