వ్యాసాలు

ఎన్‌కౌంటర్‌లలో న్యాయ వ్యవస్థ జోక్యం

ఉమేష్ పాల్ హత్య నిందితుడు, మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుండి తన ప్రాణ రక్షణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వీకరించడానికి గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తరువాత ఆ రాష్ట్ర పోలీసులే  అతని కొడుకును ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు, ఆ తర్వాత అతనితో పాటు అతని సోదరుడిని పోలీసు కస్టడీలో వుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై విచారణకు విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు