సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత