సమీక్షలు కొత్త పుస్తకం

రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం - ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి. విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక
సాహిత్యం కారా స్మృతిలో

జీవిత దృక్పథమే కథా.. కథలనిలయమే… కారా మాస్టార్

కాళీపట్నం రామారావు గారు యీ లోకం నుంచి వెళ్ళిపోవటం.. మాష్టారు గార్ని వొక‌ జ్ఞాపకంగా మాట్లాడుకోవటం బాధగా గుండెల్ని మెలిపెడుతూనే వుంది.  మాష్టారి గారితో  వ్యక్తిగతంగా.. కధానుబంధంగా..  వున్న జ్ఞాపకాలను రచయితలు మాత్రమే కాదు. యెందరో పాఠకులూ పంచుకుంటున్నారు. పరిశోధకులు కథా నిలయం తమ పరిశోధనకి యెలా వుపయోగపడిందో  గుర్తుచేసుకుంటున్నారు.  మనం రాసిన వాటినే మనం దాచుకోలేని వారెందరో వున్న కాలంలో దాదాపు మనందరి కథలని  అక్కడ భద్రపరిచే పనిని కథపై, ముందు తరాలపై యిష్టంగా.. ప్రేమగా.. బాధ్యతగా.. గౌరవంతో వారు ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేశారు.  మనందరికీ తెలుసు వారు వుపాధ్యాయులని. పిల్లలకి శ్రద్ధ లెక్కలు చెపుతూ