కవిత్వం

మరల మరల అదే వాక్యం

ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి ఇగరని మనిషివి కదా .... నాకెందుకో నా చెవులలో ఆ పసిపాపల రోదనలు తప్ప ఏమీ వినిపించదు .... ఆ కూలిన ఆసుపత్రుల గోడలనంటిన నెత్తుటి చారికల మధ్య నా మొఖం అగుపిస్తోంది .... ఎన్నిసార్లు రాసినా నీ దుఃఖ వాక్యమే మరల మరల వెంటాడుతోంది పాలస్తీనా ..... అంతరించిపోతున్న నీ నేల పచ్చని గురుతులు దుఃఖాన్ని ఆలపిస్తూ .
కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప
సమీక్షలు

మట్టి మాటల కవి

Truly to sing, that is a different breath. Rainer Maria Rilke. (Austria poet) ఇప్పుడు రాస్తున్న యువకులు అంతా తమ కొత్త గొంతుతో‌ ధిక్కార స్వరంతో‌ తమదైన నుడికారంతో రాస్తున్నారు. ఇటీవలి‌ విరసం సభలలో ఆవిష్కరించిన "నేల నుడికారం" కవిత్వం ఉదయ్ కిరణ్‌ రాసింది చదువుతుంటే మనల్ని మనంగా నిలవనీయని ఒక కుదుపు ఆ పదాల‌ పొందికలో చూసిన‌ అనుభూతికి లోనవుతాం. తీరికగా కూచుని కవిత్వం రాసే తరం కాదిది. పొట్టకూటి కోసం నిరంతరం శ్రమిస్తూనే తమ‌ రోజువారీ పనులు చేస్తున్నట్లుగానే ప్రజల పట్ల ఒక బాధ్యతగా రాస్తున్న యువతరమిది. చెప్పాలనుకున్నది సూటిగా గుండెల్లోకి
కవిత్వం

కెక్యూబ్ కవితలు రెండు

1 . అక్టోబర్ 8 ఇదో నూతన ప్రతిఘటనా సంకేతం అమెరికోన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన వియత్నాం వారసత్వం చిట్టెలుకలన్నీ కూడబలుక్కుని పిల్లిని కాదు పులిపై ఒక్కసారిగా విరుచుకుపడి బెంబేలెత్తించిన ప్రతిఘటనా పోరాటం అగ్ర రాజ్యాల అండతో తమకో దేశమంటూ లేకుండా చేసి వేలాదిమందిని ఊచకోత కోసి నిత్యమూ భయంతో తెల్లారే తమ బతుకు నుండి పెట్టిన రాకెట్ల పొలికేక వాడు గొప్పగా చెప్పుకునే ఇనుప తెరను చీల్చి నగరం నడిబొడ్డుపై నడయాడిన నెలవంకల నెత్తుటి పాదాలు వాడు ప్రపంచానికి చూపే అబద్దపు సాక్ష్యాలను మోసే మీడియాకు వాళ్ళొట్టి ఉగ్రవాదులే కానీ తమ నెత్తుటి బాకీ తీర్చుకునే
కవిత్వం

నా తల తీస్తానంటావు

మూతికి గుడ్డ నడుముకు తాటాకు కట్టుకుని అరిపాదాలతో నీ వీధిలో నడిపించిన సనాతన ధర్మం వద్దంటే నా తల తీస్తానంటావు మా ఆడవారినే జోగినిగా మార్చి నీ కోరికలు తీర్చుకునే ధర్మం మాకు వద్దంటే నా తల తీస్తానంటావు ఊరి బావిలో‌నూ చెరువు లోనూ నా దాహం తీర్చుకోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నీవు పలికే మంత్రాలేవో పొరపాటున విన్నందుకు మా చెవిలో‌ సీసం పోయించిన నీ ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు తరగతి గదిలో నీ పక్కన కూచోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు వేల ఏళ్ళుగా నీ పీతి తట్టను
కవిత్వం

దేవుడు  మాటాడాడా?

టీచరమ్మ చేతిలో బెత్తం ఎంత గట్టిగా కొట్టినా అప్పుడు ఏడుపొచ్చేది కాదు నాకు రాని వారం పేరేదో గుర్తుంచుకోవాలని కొట్టారనో హోం వర్కు చేయడం డుమ్మా కొట్టాననో ఇంట్లో నూనెలేక తలకు పెట్టుకోలేదనో నా తోటి మిత్రున్ని ఆట పట్టించాననో చింత బెత్తంతో తగిలిన బాధను పంటి బిగువన పట్టి చేయి దులుపుకునే వాణ్ణి! కానీ ఇప్పుడు నా ముఖంపై ముద్ర వేసిన మతం నన్ను వెక్కిరిస్తూ తరగతి గదిలో నన్నొంటరిని‌ చేసి రోజూ హత్తుకుని ఖుషీగా ఆటలాడుకుంటూ ఒకరికొకరం అన్నదమ్ములా భుజాలపై చేతులేసుకుని గంతులేసే మా మధ్య గోడను కట్టే ఈ తృప్తి త్యాగి టీచరమ్మలు మొలుచుకొచ్చి
కవిత్వం

ఊరేగింపు

అనాదిగా మన పుర్రెల నిండా నింపుకున్న నగ్నత్వం వాడికిప్పుడొక అస్త్రం అయింది ఆ తల్లుల దేహ మాన ప్రాణాలను నగ్నంగా ఊరేగించి భయపెట్ట చూస్తున్నాడు వాడి వికృత చూపుల వెనక దాగి వున్నది మణిపూర్ ఒక్కటేనా కాదు కాదు కాదు దండకారణ్యం నుండి మలబారు వరకూ దేశ శిఖరంపైనున్న కాశ్మీరు దాకా ఎన్నెన్ని దేహాలను మృత కళేబరాలను నగ్నంగా ఊరేగించాడు వారి కాలికింద నేలలోని మణుల కోసం గనుల కోసం బుల్డోజర్తో ఊరేగుతూ బరితెగించి పెళ్లగిస్తూ వస్తున్నాడు వాడు నవ్వుతూనే వుంటున్నాడు దేశం ఏడుస్తూ వున్నప్పుడు దేహం రక్తమోడుతున్నప్పుడు పసిపాపల దేహాలు నలిపివేయబడుతున్నప్పుడు స్రీత్వం వాడికో ఆయుధం దానిని
కవిత్వం

లేచి రా సారూ

ఏభై ఏళ్ళ మీ ఉద్యమ‌ ప్రయాణానికిసెలవంటూ నిష్ర్కమించారా మీ చేతులలో పెరిగినఎన్నెన్ని పోరాట రూపాలు మొక్కవోని మీగుండె నిబ్బరం చివరి శ్వాసవరకూ రాస్తూనే వుందన్నవార్త మీ ఆచరణకు గీటురాయి వసంత గీతంఆలపిస్తూ సాగినమీ నడక యీ అసహనఅపసవ్య వేళలోఆగిపోయి మమ్మల్నిఒంటరి చేసారు కదా సారూ ఈ ఏరువాకపున్నమి రోజు మరలమీరు సేద్యం చేయఈ నాగేటి చాళ్ళలోఉదయిస్తారు కదూ!! లే లేచి రా సారూమీ ఆకు పచ్చని ఎర్ర చుక్క టోపీధరించి ఏకే‌ అందుకునిధూలా ఆడుదురు (కామ్రేడ్ సుదర్శన్ సారుకు వినమ్ర జోహార్లతో)
స్పందన

నమ్మీకోలమ్మీ..

అమ్మీ ఓలమ్మీ ఉపాధి హామీ పనికెల్లొచ్చీసినావేటి. డబ్బులెప్పుడు పడతాయో నేదో తెలీదు కానీ ఎండతోటి గునపాం పట్టుకోనేక మట్టి కాడక తవ్వీ తవ్వీ ఇసుగెత్తిపోతే‌ నెత్తి మండిపోతున్నా తట్టల్తోని మోసుకెల్లి ముగ్గేసినట్లు గట్టు తీర్సి దిద్ది‌ ఒచ్చీసినాక ఇలా‌ గెంజి తాగి సేరబడ్డానే.  ఏటో ఈమజ్జెన ఒల్లలిసిపోయొచ్చినా సరే నిద్దర కంటి మీదకి రాక‌ టీవీ సూడ్డం అలవాటయిపోయినాదే. సీరియల్లు సూడ్డం మొదలెడితే రాతిరి పది వరకు ఆపనేం. గుంట్లకొండి పోసినామా లేదో కూడా తెలీడం లేదోలమ్మి. ఆలకి సెలవులిచ్చిన కానించి ఇంటికి జేరకుండా ఈదిలో ఆటల్తోనే కాలం గడిపేత్తున్నారే. ఈ సెల్లులొకటి కదా? ఆల్నాయన ఈమజ్జెన కొన్న
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే