వ్యాసాలు

నిరంతర శ్రామికవర్గ పోరాట స్ఫూర్తే మేడే

పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమిస్తూ ఉండేవారు. ఆనాడు శ్రమ జీవులపై పనిభారమే కాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేది. వారు రోజూ 16 గంటలు శ్రమించేవారు. కొంత మంది పెట్టుబడి దారులు కార్మికులచేత రోజూ 20 గంటలు కూడా పని చేయించేవారు. పారిశ్రామికాధిపతులు శ్రమజీవులకు అతి తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఆనాడు ఫ్యాక్టరీలలో శ్రామికులకు ఎటువంటి భద్రతగానీ, సౌకర్యాలుకానీ ఉండేవి కావు. ఫ్యాక్టరీలలో గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ ఉండేది కాదు. అందుచేత తరచుగావారు ప్రమాదాలకు గురై మరణిస్తుండేవారు. కార్మికులు