సంభాషణ

ఛత్తీస్ ఘడ్ లో మరో బూటకపు ఎన్కౌంటర్

మరణించిన మనురామ్ నూరేటి ‘మావోయిస్టు’ అన్న పోలీసులు ఆ తర్వాత కాదన్నారు . 2022 జనవరి 23న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోవున్న భరందా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మనురామ్ నూరేటి అనే యువకుడు చనిపోయాడని పోలీసుల కథనం. “ఎన్‌కౌంటర్  ప్రారంభమైనప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్ లో ఉంది. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో  ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆగిపోయిన తరువాత, సంఘటన స్థలం నుండి ఒక మావోయిస్టు మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్ (ఎమ్‌ఎల్‌జి)ను స్వాధీనం చేసుకున్నది, ”అని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ చెప్పారు, ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. “రాత్రి 10 గంటల ప్రాంతంలో, నా భర్త పక్షులను వేటాడేందుకు స్లింగ్‌షాట్‌తో బయటికి వెళ్లాడు. అతను స్వెటర్‌ సాధారణ  చెప్పులు వేసుకున్నాడు, కానీ  పోలీసులు చూపించిన మృత దేహానికి యూనిఫాం వుంది, రైఫిల్‌