కిటికీ పక్కన సీటు
కవిత్వం

కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం మీకు అనుభవమేనా.. చల్లని గాలి తనువును తాకుతుంటే జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి పరిసరాలు వెనక్కు పోతుంటే పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి.  బస్సుతో పాటు టైరు ఆడుతూ  బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు బస్ కోసం పరిగెత్తుతూ  వస్తున్న తల్లెంట  వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు మన బాల్యాన్ని  బావిలోనుండి నీళ్ళు తోడినట్లుగా తొడుతుంటాడు. ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని కండక్టర్ టికెట్ అని అడిగితే మావోడు ఒకటో తరగతే అని అమ్మ చెబితే.. అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి  బస్ ఎక్కినప్పుడల్లా మన చదువు
సాహిత్యం కవిత్వం

శాంతి స్వప్నం

పుస్తకాలు రాజ్యాన్ని భయపెట్టిస్తున్నాయి అందుకే అది పుస్తకం పుట్టకముందే పురిటీలోనే బంధిస్తున్నది పే....ద్ద పాలక ప్రభుత్వం చిన్న పుస్తకానికి, పుస్తకంలోని అక్షరాలకు భయపడటం చరిత్రలో మాములే కానీ.. పుస్తకాలు పురిటినొప్పులు  పడుతున్నప్పుడే పుట్టబోయేది "సాయుధ శాంతి స్వప్నమని"  భయపడి బంధించడమే ఇప్పుడు నడుస్తున్న అసలు రాజ్యనీతి అంతేకదా నెత్తురు మరిగిన రాజ్యానికి శాంతి స్వప్నమంటే  పాలకులకు పెనుగులాటే కదా మరి స్మృతులు యుద్ధాన్ని సృష్టిస్తాయట దుఃఖాల కలబోతకు కూడా కలవరపడుతున్న రాజ్యం ఎంత దృఢమైనదో తెలుస్తున్నది కదా అంతా మేకపోతు గంభీరమే అని
సాహిత్యం కవిత్వం

క‌ళ్లారా చూశాము

కామ్రేడా.... ఆర్‌కే అమరులు అస్తమయంలోనుంచే ఉదయిస్తారనే మాటను మొన్ననే మేము కళ్లారా చూశాము. ఆర్‌కే  అమడ‌య్యాడ‌న‌గానే ఎన్ని హృదయాలు అయ్యో.. ఆ మాట అబద్ధం అయితే బాగుండని తల్లడిల్లయో సరిగ్గా అప్పుడే చూశాము కామ్రేడా.. నీవు మరణిస్తూనే రెట్టింపు వెలుగుతో  ఉదయిస్తూన్నావని అస్తమయం క్షణకాలమని అది వేన వేల వెలుగుతో అరుణోదయం తప్పదని కామ్రేడా.. మేము మొన్ననే చూశాము ఉక్కు సంకల్పంతో నువ్వు హామీపడ్డ మాటని నేలకొరిగి నెరవేర్చినప్పుడు "జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం" అని నీవు హామీపడ్డ మాటను ఆలింగనం చేసుకున్నప్పుడు కామ్రేడా.... మేము మొన్ననే చూశాము  కోట్లాదిమంది