సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు.