కవిత్వం

ఆట పాటల రూపు

ఆట వైతివా అన్న పాట వైతివా జనహోరు గుండెల్లో రాగమైతివా ధన ధన మోగెడప్పు దరువువైతివా...."2" ఎగిసేటి ఉద్యమాల గురువువైతివా...2" పొడిసేటి పొద్దుల్లో వెలుగుగైతివా "ఆట వైతివా" వెలివాడ బతుకుల్లో ఎట్టి చూసినవ్ ఏతలన్ని పోయే పోరు బాట వట్టినవ్ ప్రశ్నించే పాటవై మేలు కొల్పినావు .."2"... పాలకుల గుండెల్లో దండోరావైనవ్ " ఆట వైతివా" నల్లమల అడవులన్ని కలియతిరిగినవ్ నమ్ముకున్న పేదప్రజల గోసచూసినవ్ సమ సమాజ స్థాపన ధ్యేయమన్నవు..."2" అమరులే..ఆదర్శ మూర్తులన్నావు "ఆట వైతినా" పసిపాప నవ్వంత స్వచ్ఛమైంది స్వార్థమే లేనట్టి ప్రయాణం నీది సామ్రాజ్యవాదం పై పోరాటం నీది...."2" దాన్ని కొనసాగించే నినాదం మాది.