ఇంటర్వ్యూ

ఉపా లేకుంటే ఈ రాజ్యం మ‌నుగ‌డ క‌ష్ట‌మే

దేశ‌మంతా ఉపా విస్త‌రిస్తోంది. ఎవ‌రి మీదైనా చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టం కింద కేసు పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రి మీదికైనా ఎన్ఐఏ అనే ద‌ర్యాప్తు సంస్థ వెళ్ల‌వ‌చ్చు. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రుగుతున్న‌ది కాద‌ని, దీని వెనుక భార‌త రాజ‌కీయార్థిక వ్య‌వ‌స్థ‌లోని సంక్షోభాలు, ప్ర‌జా పోరాటాల ఒత్తిళ్లు  ఉన్నాయ‌ని, యుఏపీలే లాంటి పాసిస్టు చ‌ట్టాలు లేకుంటే భార‌త రాజ్యం మ‌నుగ‌డ సాధ్యం కాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింద‌ని పౌర‌హ‌క్కుల నాయ‌కుడు చిలుకా చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు.  1) యుఏపీఏ చట్టం తీసుకుని రావటం వెనుక ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం ఏమిటి ?   ప్రభుత్వాలు తమ రాజకీయ సుస్థిర‌త  కోసం చట్టాలను చేస్తూ ఉంటాయి. ఈ