నివాళి

అరుదైన విప్లవోద్యమ నాయకుడు కా. కోపా ఊసెండి

కామ్రేడ్‌ కోపా కాండె ఊసెండి ఆరు పదులు దాటిన మడిమతిప్పని విప్లవకారుడు. ఆయన విప్లవ ప్రస్థానం మూడు పదుల వసంతాలు. ఆయనకు ఇద్దరు భార్యలు. 9 మంది సంతానం. అయిదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. పుష్కలమైన బంధు వర్గం. ఆయన స్వగ్రామం ఏటపల్లి తాలూకాలోని పర్సల్‌ గొంది. ఆయన తండ్రి పేరు  కాండే, తల్లి పేరు  బుంగిరి. అది ఆదివాసీ గూడాలలో ఓ మోస్తర్‌ పెద్ద ఊరు కిందే లెక్క. ఊళ్లో 200 కడప వుంటుంది. ఆ ఊరు జిల్లాలోనే గనుల తవ్వకానికి ఆరంగేట్రం చేసిన సుర్దాగఢ్‌ పర్వత సానువుల వద్ద వుంటుంది. మార్చ్‌ 14తో కా. కోపా
సంస్మరణ

కాకలు తీరిన యోధుడు సృజన్ సింగ్

భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది. గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980,
సంభాషణ

గజ్జె గట్టి గొంతు విప్పి జనంలో గానం చేసిన  ప్రజా గాయకుడు

దండకారణ్య విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాలు అలుపెరుగని, మడిమ తిప్పని గొప్ప విప్లవ కారుడు, ప్రజల ముద్దు బిడ్డ శంకరన్న. ఆయన 1960లలో సిరొంచ తాలూకాలోని అంకీస-ఆసరెల్లిలకు సమీపంలో కల సాతాన్ పల్లిలో నిరుపేద ఆదివాసీ వాసం వారి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు తల్లి-తండ్రులు శివా అని పేరు పెట్టుకున్నారు. ఆయన వాసం శివా గానే పెరిగాడు. అందరాదివాసీ పిల్లల లాగే ఆయన చదువు సంధ్యలు నోచుకోలేదు. చదువుకోవాలనే కోరిక ఎంతున్నా పేదరికం అనుమతించలేదు. ఆయన నవ యవ్వన ప్రాయంలోనే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి అనతికాలంలోనే పూర్తికాలం విప్లవకారుడిగా విప్లవోద్యమంలో చేరిపోయాడు. గడ్ చిరోలీ జిల్లాలో ఉద్యమంలో చేరిన