నివేదిక

‘అదానీ గో బ్యాక్!’

 'గొందుల్‌పారా' బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత 'గొందుల్‌పారా' బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు. అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని