సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప