కాలమ్స్ క్యా చల్రా .?

సంస్కరించుకోకపోతే తాలీబన్లను కూడ తరిమేస్తారు

  1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా? సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ,