సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన