సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు