సాహిత్యం కవిత్వం

హత్యలు కాని హత్యలు

ఇంటిమనిషిని కోల్పోయిన నొప్పిలా ఉంది సలుపు చేప ముల్లు గొంతులో దిగితేదవఖానకు పరుగెట్టొచ్చు తూట వెన్నులో దిగితేకుప్పకూలడం తప్ప దారేది తెలియకుండా జరిగినదే కావచ్చుమీ తుపాకులకు గందపు వాసన తప్పకన్నీటి వాసన తెలియదు కడుపుకోతకు గురైన ఇండ్లలోకిమనుషులుగా వెళ్ళి చూడండిగుమ్మాల్లో మనుషులకు బదులుగాదుఃఖాలు గుండెలు బాదుకుంటూఉంటాయి మీకు తెలియకుండా జరిగినదే కావచ్చుజరిగింది ఆస్తినష్టం కాదుప్రాణనష్టం కూలింది కూలీలుకుటుంబాన్ని కాపు కాసే మట్టిగోడలు సాయమందించి చేతులు దులుపుకున్నాకొన్ని ప్రేమలబాకీ ఎవరు తీరుస్తారు కలచివేసే వార్త ఈ రోజు వరకేఅన్ని సర్దుకపోతాయిప్రజలూ మరచిపోతారు రాని తండ్రి కొరకు ...ఓ బిడ్డ ఇంకా తలుపు వద్దబొమ్మను నిద్రపుచ్చుతూ ఎదురుచూస్తోంది ఏ షా దిగివస్తాడుబిడ్డను
కాలమ్స్ కవి నడిచిన దారి

ఇది ప్ర‌యాణం..

చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో  పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు.  కర్నూలు లో పుట్టాను.  అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.  ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.